అలాగే మార్టిన్ గుప్టిల్ భారతదేశంపై సర్జికల్ స్ట్రైక్ చేసాడని ఐసీసీ ద్రువీకరిస్తోంది. హెలికాప్టర్ షాట్ కుప్పకూలింది, స్వచ్ఛమైన సర్జికల్ స్ట్రైక్ చేశారు, ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సర్కిల్ బయట ఆరుగురు ఫీల్డర్లు ఉన్నారు. అది మీకు కనిపించలేదా? అంటూ సెటైర్లు విసురుతూ పోస్టులు పెడుతోంది.
అయితే ఐసీసీ తీరుపై భారత ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించినందుకు ఐసీసీ చాలా సంతోషిస్తుందనుకుంటా, ఇప్పటికే బాధలో ఉన్నాం. మమ్మల్ని వేధించకండి. మేము ఇక భరించలేమని కామెంట్లు చేస్తున్నారు.