గేల్ ఔట్... హోప్ గాన్... వెస్టిండీస్ విన్నింగ్ ఛాన్స్ 30 శాతానికి పడిపోయింది..

గురువారం, 27 జూన్ 2019 (20:13 IST)
వెస్టిండీస్ బ్యాట్సమన్లు నిలకడగా ఆడలేక వికెట్లు పారేసుకుంటున్నారు. విండీస్ బ్యాట్సమన్లలో డైనమైట్ లాంటి ఆటగాడు గేల్ కేవలం 6 పరుగులు చేసి ఔటవ్వడంతో మ్యాచ్ విన్నింగ్ స్టేటస్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన హోప్ కూడా 5 పరుగులకే ఔటయ్యాడు.

వీరిద్దరూ షమీ బౌలింగులో ఔటయ్యారు. ఇక ప్రస్తుత రన్ రేట్ 8 ఓవర్లు ముగిసే సమయానికి 2.5గా వుంది. కావలసిన రన్ రేట్ ఓవర్ కి ఆరు పరుగులకి చేరింది. ఈ లక్ష్యం సాధారణమైనది కాదు. కాగా వెస్టిండీస్ ముందు టీమిండియా 269 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. 
 
ఇకపోతే... సహజంగా పాకిస్తాన్ ఆటగాళ్లు కానీ ప్రజలు కానీ టీమిండియా చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు మాత్రం మన జట్టు వెస్టిండీస్ జట్టుని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుపై కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. ఆయనే షోయబ్ అక్తర్.
 
ఇక అసలు విషయానికి వస్తే... భారత్ ఇప్పటి వరకు ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ వెస్టిండీస్‌తో తలపడనుంది. తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది. మరో రెండు మ్యాచుల్లో నెగ్గితో భారత్ సెమీ ఫైనల్‌కి చేరుతుంది. కనుక నాలుగు జట్లలో రెండు జట్లపై గెలిస్తే చాలంతే. 
 
ఐతే వెస్టిండీస్, ఇంగ్లాండుపైన కనుక ఓడిపోతే ఏం జరుగుతుంది. పాకిస్తాన్ జట్టుకు గడ్డు కాలం ఎదురవుతుంది. అదే.. ఈ రెండు జట్లు కనుక భారత జట్టుపై గెలిస్తే పాకిస్తాన్ జట్టుకి సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే... వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లను చిత్తుగా భారత్ ఓడించాలని షోయబ్ అక్తర్ కోరుకుంటున్నారు. మిగిలిన పాకిస్తాన్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలాగే వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు