తన ప్రియుడుతో కలిసి జీవించేందుకు అడ్డుకున్న ముగ్గురు బిడ్డలతోపాటు కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు కసాయి మహిళ ప్లాన్ వేసింది. ఈ కుట్ర నుంచి ఆమె భర్త తప్పించుకోగా, ముగ్గురు పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ కిరాతక చర్యకు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూరులో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు..
అమీన్‌పూర్‌కు చెందిన రజిత (45) అనే మహిళకు తమ పిల్లలు చదివే పాఠశాలలో జరిగిన గెట్ టు గెదర్ పార్టీలో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కుటుంబానికి దూరమై, తన ప్రియుడుతో కలిసి జీవించాలని రజిత నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య, పిల్లను చంపేయాలన్న కఠిన నిర్ణయం తీసుకుంది.
ఇందులోభాగంగా, గత నెల 27వ తేదీన భోజన సమయంలో రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు. పిల్లలతో మాత్రం బలంవంతంగా పెరుగు తినిపించింది. దీంతో వారంతా అనారోగ్యానికి మృత్యువాతపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో రజితతో పాటు