తెలంగాణ రాష్ట్రంలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న దంపతులను వెంటాడిన ఓ దొంగ... నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైకుతో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదారు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.