అమెరికాలో గుడివాడకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పేరు కొల్లి అభిషేక్. గత యేడాది క్రితమే వివాహం చేసుకున్న అభిషేక్... భార్యతో కలిసి ఫీనిక్స్‌లో ఉంటున్నారు. అయితే, గత ఆరు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న అభిషేక్ తీవ్రంగా కుంగిపోయాడు.
అయితే, కొల్లి అభిషేక్ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. దానికితోడు, ట్రంప్ ప్రభుత్వం వచ్చాక విధించిన ఆంక్షలతో భవిష్యత్‌పై ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో అతడు బలన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కాగా, అభిషేక్ ఆత్మహత్యతో గుడివాడలో ఉన్న అతడి కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.