భార్యా బాధితులు క్రమంగా ఎక్కువైపోతున్నారా... అంటే అవుననే అనే పరిస్థితి కనిపిస్తున్నట్లుంది. ఇటీవలే బెంగళూరులో ఓ టెక్కీ తన భార్య వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరో భార్యా బాధితుడు బలవన్మరణం చెందాడు. ముంబై నగరంలో మానవ్ శర్మ అనే యువకుడు తన భార్య పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.
ఆ వీడియోలో అతడు బెడ్ షీటును మెడకి చుట్టుకుని ఫ్యానుకి కట్టి కనబడ్డాడు. వీడియోలో మాట్లాడుతూ... నా భార్య నన్ను చెప్పుకోలేనివిధంగా వేధిస్తోంది. నేనిక బతకలేను. నా ముందు చావు ఒక్కటే పరిష్కారం కనబడుతోంది. దయచేసి మగవాళ్లు గురించి ఎవరైనా మాట్లాడండి. మగవాళ్లు అనుభవిస్తున్న బాధలను చూడండి. నేను ఒంటరినైపోయాను. నేను చనిపోయాక నా తల్లిదండ్రుల జోలికి మాత్రం వెళ్లొద్దు'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. అతడు ముంబైలోని టీసీఎస్ లో రిక్రూట్మెంట్ మేనేజరుగా పనిచేస్తున్నట్లు సమాచారం.