ని పని మనిషి చంపేసి, డబ్బు, నగలతో పారిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బొద్దులూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి ఉంటోది.
ఈ క్రమంలో గత అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చిచూడగా కుమారుడు అపస్మారకస్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచమీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పని మనిషి అనూష కనిపించకపోవడంతో, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.