వీడియోలో శ్రీకాంత్ ఓదెల, రాఘవ్ క్యారెక్టర్ ని, బ్రూటల్ నేచర్ ని వివరిస్తున్నారు. సినిమాలో అతని పాత్ర గురించి తెలుసుకోవడానికి నటుడు ఉత్సాహంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
రాఘవ్ జుయల్ ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన యాక్టర్. కిల్, గ్యారా గ్యారా వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అతను ఇప్పుడు 'ది ప్యారడైజ్'లో నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మెమరబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
హాలీవుడ్ స్టూడియోతో కలిసి పనిచేయడం కోసం ప్రస్తుతం మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. అప్‌డేట్స్‌ని త్వరలోనే షేర్ చేసుకోబోతున్నారు. 'ది ప్యారడైస్' సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ అనే ఎనిమిది భాషల్లో విడుదల అవుతుంది. ఈ సినిమా సినిమాటిక్ ఎక్స్‌లెన్స్‌కి ఇది న్యూ స్టాండర్డ్స్ నెలకొల్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా పాన్-వర్డ్ లెవెల్‌లో విడుదల కానుంది.