చిన్నతనంలో వీధుల నుంచి తీసుకొచ్చి పెంచిన ఓ మైనర్ బాలికను అదే మహిళ బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించిందని ఆరోపణలు వచ్చాయి. బుధవారం యూసుఫ్‌గూడలోని ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలికను వ్యభిచారం నుంచి రక్షించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 14 ఏళ్ల బాలికకు అనాధ. రహ్మత్ నగర్‌లోని వీధుల నుండి నిర్వాహకురాలు మహా లక్ష్మి ఆ బాలికను పెంచింది. ఆమె యుక్తవయసులోకి వచ్చాక బెదిరించి బెదిరించి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టింది. మహాలక్ష్మి చెప్పినట్లు వినకపోయే సరికి తనను దుర్భాషలాడారని, దాడి చేశారని బాలిక పోలీసులకు తెలిపింది.