దొంగతనం కేసు పెట్టేందుకు వెళితే అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు!!

ఠాగూర్

బుధవారం, 28 ఆగస్టు 2024 (11:54 IST)
తమ ఇంట్లో పని చేసే పనిమనిషిపై దొంగతనం కేసు పెట్టేందుకు వెళ్లిన ఓ నగల వ్యాపారిపై మహారాష్ట్ర రాజధాని ముంబై నగర పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ సంఘటన ముంబైలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
55 యేళ్ళ స్థానిక నగల వ్యాపారి ఒకరు తన ఇంట్లో పని చేస్తున్న 27 యేళ్ల మహిళ రూ.15 వేల నగదు చోరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చోరీ చేసినట్టు తొలుత అంగీకరించిన ఆ పనిమనిషి.. తనపై యజమాని పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యేడాది ఫిబ్రవరి నుంచి నగల వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నానని, తాను ఒంటరిగా ఉన్న సమయంలో అతడు వేధింపులకు పాల్పడేవాడని ఆమె ఆరోపించారు. 
 
అతడి భార్య ఇంట్లో లేని సమయంలో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. జరిగిన విషయాన్ని బయటపెడితే తన భర్తను, బిడ్డను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. పైగా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి డబ్బులు కూడా ఇవ్వజపాడని, అయితే, వాటిని తాను తీసుకోలేదని చెప్పారు. దీంతో పోలీసులు ఆ పనిమనిషిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, నగల వ్యాపారిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు