తనకు మమ్మీడాడీ ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారనీ, అందువల్ల తాను చనిపోతున్నానని, తన చావుకు తన తల్లిదండ్రులే కారణమని ఓ వివాహితుడు ఓ సెల్ఫీ వీడియో తీసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాకినాడ రూరల్ శశికాంత్ నగర్‌కు చెందిన వేణుగోపాల్ కృష్ణ అనే వ్యక్తి ఈ సెల్ఫీ వీడియోను తీశాడు. తనకు ఇష్టంలేకపోయినా పెళ్లి చేశారని, తనతోపాటు తన భార్యను కూడా వేధించడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాపోయాడు.
అందుకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యంచాలకపోయినా మరో గత్యంతరంలేని స్థితిలో ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని తెలిపారు. నా అత్మహత్యకు మా అమ్మ ప్రధాన కారణమని ఆమెకు వత్తాసుపలికే తన తండ్రి కూడా కారణమని ఆరోపించాడు. దీనిపై కాకినాడ రూరల్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.