పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)

ఠాగూర్

గురువారం, 13 మార్చి 2025 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో నవవధువు పెళ్ళయిన వారానికే తన మాజీ ప్రియుడుతో కలిసి వెళ్లిపోయింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే తన ప్రియుడుతో కలిసి వెళ్లిపోతున్నట్టు నవ వధువు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
రంగారెడ్డి జిల్లాలో ఇరు కుటుంబ సభ్యులు కలిసి వధువుకు ఇష్టంలేని పెళ్లి చేశారు. ఈ విషయంపై ఆ యువతి షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నట్టుగా.. తన నిశ్చితార్థానికి ముందే పెళ్లి కుమారుడు శివరామకృష్ణకు ముందే తమ ప్రేమ విషయం చెప్పాను. కానీ, తన తల్లిదండ్రులు బలవంతంగా ఒత్తిడి చేసి ఈ వివాహం జరిపించారు. 
 
పెళ్లయిన తర్వాత భర్త శివరామకృష్ణ, తన తల్లిదండ్రులు, అత్తింటివారంతా కలిసి బెదిరించి కాపురం చేయించేందుకు ప్రయత్నించారు. కత్తులతో చంపుతామని బెదిరించారు. తన భర్త శివరామకృష్ణతో ఉండటం ఇష్టంలేక తన ప్రియుడు అరవింద్‌తో కలిసి పెళ్లిపోతున్నాను. ఇందులో ప్రియుడు అరవింద్ ప్రమేయం ఏమాత్రం లేదు. తన ఇష్టపూర్వకంగానే వెళుతున్నాను ఆ వధువు తన సెల్ఫీ వీడియోలో పేర్కొంది. 

 

పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు

రంగారెడ్డి జిల్లాలో కుటుంబ సభ్యులు వధువుకు ఇష్టం లేని పెళ్లి చేశారని, ఈ విషయం పెళ్ళికొడుకు శివరామకృష్ణకు ముందే చెప్పినట్లు తెలిపింది. నిశ్చితార్థం తర్వాత కుటుంబ సభ్యులు తనను ఇబ్బందులకు గురి చేశారని తెలిపిన వధువు. తన ప్రియుడు… pic.twitter.com/64U87xLkAc

— ChotaNews App (@ChotaNewsApp) March 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు