ఇంట్లో విగతజీవిగా కనిపించిన మహిళా ప్రొఫెసర్ .. ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 11 జులై 2025 (23:05 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో విషాదకర ఘటన జరిగింది. 55 యేళ్ల మహిళా ప్రొఫెసర్ ఇంటిలో విగతజీవిపడివున్నారు. మృతురాలి పేరు ప్రజ్ఞా అగర్వాల్. తన నివాసంలోనే ఆమె విగతజీవిగా కనిపించారు. ఆమె ఇంట్లో పదునైన ఆయుధంతో కోసుకున్న గాయాలు, మెడపై కోతలు ఉండటంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం దీన్ని అసాధారణ మరణంగా పేర్కొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాల మేరకు మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపించారు. 
 
శుక్రవారం పనిమనిషి ప్రజ్ఞా అగర్వాల్ ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె విగతజీవిగా పడివున్నారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రజ్ఞా మణికట్టు, మెడపై లోతైనా గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో రక్తం మరకలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపించినప్పటికీ అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నామని, ఆమె ఇంట్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గాయాలు ఆమె చేసుకున్నవేనా లేదా ఎవరైనా దాడి చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు