నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్‌లో రిషి (7) అనే ఏడేళ్ళ బాలుడు దిగడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు గుట్టుచప్పుడుకాకుండా ఆ బాలుడుని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి వచ్చేలోపు రిషి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అయితే, మృతుడు తల్లిదండ్రులు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. వాటర్ వరల్డ్‌లో తమ బిడ్డపడి మరణించాడని, దీనిని కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరుక కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.