ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ మూవీ "28°C" తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇస్తున్నారు సాయి అభిషేక్. ఆయన వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను నిర్మించారు. "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "28°C" మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాత.
- నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ క్లోజ్ ఫ్రెండ్స్. మూవీస్ మీద మా ఇద్దరికీ ప్యాషన్ ఉండేది. అనిల్ క్షణం సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యాడు. నేను కూడా డైరెక్షన్ వైపు ప్రయత్నాలు చేశాను. కొద్ది రోజుల తర్వాత మనమే కలిసి మూవీ చేద్దామని నేను, అనిల్ నిర్ణయించుకున్నాం. "28°C" అనే టెంపరేచర్ పాయింట్ తో అనిల్ విశ్వనాథ్ చెప్పిన కథ ఇంప్రెస్ చేసింది. ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకంతో మూవీ స్టార్ట్ చేశాం.
- మొదట ఈ మూవీకి వేరే హీరోలను అనుకున్నా, నవీన్ చంద్రకే బాగుంటుందనే నిర్ణయించాం. ఈ మూవీకి ఫస్ట్ అనుకున్న హీరోయిన్ అంజలి. కొంత ట్రెండీగా కొత్త ఫేస్ ఉంటే బాగుంటుందని షాలినీని తీసుకున్నాం. వైజాగ్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి గోవా, ఆ తర్వాత జార్జియా వెళ్లాం. ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకుండా హై క్వాలిటీతో మూవీ చేశాం. సినిమా కంటెంట్ మీద మా టీమ్ అందరికీ మంచి నమ్మకం ఉండేది.
- 2019లోనే "28°C"మూవీ రెడీ అయ్యింది. 2020 మేలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కరోనా పాండమిక్ వల్ల థియేటర్స్ లో రిలీజ్ చేయడం కుదరలేదు. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఈ ప్లాట్ ఫామ్స్ కు ఇంత డిమాండ్ ఏర్పడుతుందని అప్పుడు ఊహించలేదు. థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం సినిమా కదా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే కోరిక ఉండేది. నా కో ప్రొడ్యూసర్స్, అనిల్, టీమ్ అందరితో డిస్కస్ చేశాక వాళ్ల సపోర్ట్ తో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని పట్టుదలగా వేచి చూశాం. కొద్ది రోజుల్లో అంతా మామూలుగా అవుతుందని అనుకుంటే, అది కొన్ని నెలల పాటు సాగింది. అలా మా మూవీ రిలీజ్ ఆలస్యమైంది. వంశీ నందిపాటి గారి ఇనిషేటివ్ తో ఈ నెల 4న మా "28°C" సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నాం.
- హీరోగా నవీన్ చంద్ర మాకు బాగా కోపరేట్ చేశాడు. సినిమాను మాతో పాటు ఆయన బాగా నమ్మాడు. షూటింగ్ టైమ్ లోనే కాదు ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ షాలినీ కూడా బాగా పర్ ఫార్మ్ చేసింది. "28°C" టెంపరేచర్ లో హీరోయిన్ ఉండాల్సిన హెల్త్ కండీషన్ ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ దాటితో ఆమెకు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఈ జంట ఎలా ఎదుర్కొన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకే జానర్ లో ఈ మూవీ సాగదు. డిఫరెంట్ జానర్స్ లో వెళ్తూ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా మూవీ రూపొందించాడు.
- ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. మేము షూటింగ్ కోసం ఎంతో ఖర్చు పెట్టామని అక్కడి మీడియా ద్వారా తెలుసుకుని జార్జియా ఆఫీసర్స్ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం.
- ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం.