కొలువు ఉంటుందో.. ఊడుతుందో.... తీవ్ర ఒత్తిడిలో వేతనజీవులు

గురువారం, 22 అక్టోబరు 2020 (10:30 IST)
కంటికి కనిపించని కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్ దెబ్బకు వలస కూలీలు ఉపాధిని కోల్పోయి తిరిగి తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. అలాగే, కరోనా లాక్డౌన్ పుణ్యమాన్ని అనేక కంపెనీలు మూతపడ్డాయి. వీటిలో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోలేదు. మున్ముందు తెరుచుకుంటాయన్న ఆశా లేదు. దీంతో వేతన జీవుల జీవితాలు దినదినగండంలా మారాయి. ఫలితంగా నెలవారి జీతాలు తీసుకునే ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక మండలి (వరల్డ్ ఎకనామికి ఫోరమ్) తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. 
 
ముఖ్యంగా, వచ్చే యేడాది కాలంలో ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా..? అని ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా (54 శాతం) వేతనజీవులు ఆందోళన చెందుతున్నారట. భారత ఉద్యోగుల్లో వీరి వాటా 57 శాతంగా ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) తాజా సర్వే నివేదిక వెల్లడించింది. 
 
అయితే, భవిష్యత్‌ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్య శిక్షణలో తమ యాజమాన్యం సాయపడుతుందని ప్రపంచ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది నమ్మకంగా ఉన్నారు. భారత ఉద్యోగుల్లో 80 శాతం తమకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు