అన్నయ్య సక్సెస్‌ను చూసి తమ్ముడు జడుసుకుంటున్నాడట. ఈ అన్నయ్య-తమ్ముడు ఎవరనేది అందరికీ బాగా తెలుసు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైన చిరంజీవి ఏం చేస్తాడులే అనుకున్నవారికంతా ఖైదీ నెంబర్ 150 విజయంతో గట్టి షాక్ తగిలింది. ఈ షాక్ ప్రభావం పవన్‌పై కూడా పడింది. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో ఎవ్వరికీ భయపడని పవన్ కల్యాణ్.. తొలిసారిగా తన అన్నయ్యను చూసి జడుసుకుంటున్నాడని తెలిసింది.
కాంగ్రెస్‌లో వున్నాడు.. ఏం చేస్తాడులే అనుకుంటే ఖైదీతో కోట్ల కలెక్షన్లు సాధించాడు. కానీ ఖైదీ విజయంతో మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు చిరు ప్లాన్ చేస్తున్నాడని.. ఇదే అంశంపై ప్రస్తుతం పవన్‌ను యోచించేలా చేస్తుందని సమాచారం. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్‌పై మెగాస్టార్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రాకపోవడంపై కూడా మండిపోతున్నారు.
కానీ ఈ ఫంక్షన్‌కు జనసేన కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చి హంగామా చేశారు. దీనిపై చిరు కోపంగా మాట్లాడటం జరిగిపోయాయి. కానీ ఖైదీ రిలీజ్ తర్వాత చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పనిలో పనిగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా చిరంజీవిని నియమిస్తారని వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్ని టార్గెట్ చేసిన జనసేనాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు అటు వైసీపీని డీగ్రేడ్ చేస్తూనే కనిపించకుండానే టీడీపీతో పొత్తు రాజకీయాలను నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య కాంగ్రెస్ తరపున పోటీకి దిగితే.. ఇక తమ్ముడికి ఇబ్బందులు తప్పవు. దీంతో అన్నయ్యతో పొలిటికల్ సమరానికి సిద్ధమవ్వాలా? అని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.