అదేసమయంలో జయలలిత ప్రియనెచ్చెలి శశికళ కూడా ప్రధాని మోడీకి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కారణం అక్రమాస్తుల కేసులో శశికళ కూడా దోషే. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అదేసమయంలో జయలలిత స్థానంలో ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి... రాజ్యాంగేతర శక్తిగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారు.
తద్వారా పార్టీపైనా, ప్రభుత్వంపైనా పెత్తనం చేయాలని కోరుకుంటారు. పైగా, పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకోవడమే కాకుండా, పార్టీని మరింత బలోపేతం చేయాలనే శశికళ కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పెక్కుమంది ఆమె వర్గీయులే కావడం గమనార్హం. అందువల్ల ఆమె వ్యూహాలకు ఎలాంటి ఆటంకం కలగబోదని చెప్పొచ్చు.