వివరాలలోకి వెళ్తే... తెలుగుదేశం పార్టీలో టికెట్ నిరాకరణకు గురై... జనసేనలోకి అడుగుపెట్టిన ఎస్పీవై రెడ్డికి జనసేనాని ఊహించని రీతిలో ఏకంగా మూడు టిక్కెట్లు ఇచ్చారు. వీటిలో... నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగగా.. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు.
అయితే మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్పీవైరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామనీ, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేయడంతో ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారనీ... జనసేన పార్టీ తరఫున ఆయన కుటుంబం వేసిన నామినేషన్లను అన్నింటినీ ఉపసంహరించుకోనున్నారనీ తెలుస్తోంది.
అదేదో సినిమాలో చెప్పినట్లు... పార్టీలు, అధినేతలు అన్నీ కొత్తవే అయినప్పటికీ... ప్రజా క్షేత్రం నుండి వెళ్లే ప్రతినిధులు మాత్రం ఎప్పుడు ఏ పక్షానికి వెళ్తారో... ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటారో చెప్పలేని వాళ్లే.