తయారీ విధానం: లేత అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ధనియాలు, జీలకర్రను అరగంటపాటు ఊరనివ్వండి. అల్లంముక్కలను మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో నానబెట్టిన ధనియాలు, జీలకర్రను చేర్చి రుబ్బుకోవాలి. ఇందులో బెల్లం కలిపి మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడయిన బాణలిలో మిశ్రమాన్ని కలియబెట్టండి. తర్వాత నెయ్యి చేర్చి మెల్లమెల్లగా కలుపుతూ స్టౌ మీద నుంచి దించేయండి. ఈ లేహ్యాన్ని మరో పాత్రలో భద్రపరచండి.