జై సమైక్యాంధ్ర అభ్యర్థికి ఫైనాన్షియర్ల ఫైనాన్స్

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (21:22 IST)
WD
సినిమా తీయాలంటే డబ్బుకావాలి. ఆ డబ్బు రకరకాలుగా వస్తుంటుంది. స్వంతంగా నిర్మాణం చేపట్టే ఎంత పెద్ద సంస్థయినా ఫైనాన్షియర్లతో టై అప్‌ అయి సినిమాలు తీస్తుంటారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా తెలిసినవారయితే ఇస్తుంటారు. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్‌ కాబట్టి సినిమాలు తీసే నిర్మాతలు తక్కువయ్యారు. మొన్నటివరకు నిర్మాత నట్టికుమార్‌.. శ్రీకాంత్‌ శ్రీహరి, జగపతిబాబు, తరుణ్‌ వంటివారితో సినిమాలు తీసి సరైన ఆదరణ లేకపోవడంతోపాటు డబ్బింగ్‌ సినిమాలపై పడ్డాడు.

కానీ ఇప్పుడు ఎలక్షన్ల హడావుడి కావడంతో.. వైజాగ్‌లోని తన ప్రాంతంలో ఖర్చు పెడుతున్నారు. ఇలా చాలామంది నిర్మాతలు రూటు మార్చారు. ఏదో రాజకీయ పార్టీలకు కొందరు ఫైనాన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. సినిమావాళ్ళకు 10 రూపాయలకు ఫైనాన్షియర్లు ఇస్తే.. ఇంకాస్త ఎక్కువగా పొలిటీషియన్స్‌కు ఇస్తున్నారు. ఒకేవేళ ఇచ్చినా పొలిటీషియన్‌ అంటే గ్యారంటీ ఉంది. ప్రజల సొమ్ము, పార్టీ ఫండ్‌ తదితరాలు ఏదో రకంగా ఫైనాన్సియర్‌కు అందుతాయి.

ఐతే సినిమా విషయాల్లో అలాక్కాదు... సినిమా హిట్‌ అయితే అందుతుంది. లేదంటే సినిమా హక్కులు రాయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రముఖ పాత్ర వహిస్తున్న సాయి వెంకట్‌.. ప్రస్తుతం ప్లేట్‌ మార్చి సమైక్యాంద్ర పార్టీ టికెట్‌పై జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నారు. చిన్నాచితకా నిర్మాతలకు ఫైనాన్స్‌ ఇచ్చేవారంతా ఇప్పుడు ఆయన ఇచ్చేందుకు క్యూ కడుతున్నారని టాలీవుడ్ సినీ న్యూస్.

వెబ్దునియా పై చదవండి