పీఆర్పీని చిరు ఏడాదికి అమ్మేస్తే... పవన్ నెలకే బేరం పెట్టేశాడు...

శనివారం, 26 ఏప్రియల్ 2014 (11:50 IST)
WD
పీఆర్పీని చిరంజీవి ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీకి టోకుగా అమ్మేస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ నెల రోజులకే భాజపాకు బేరం పెట్టేశాడంటూ ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన నిర్మాత ఆదిశేషగిరిరావు విమర్శించారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

2014 ఎన్నికల్లో తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్రను దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఓటమి భయం చంద్రబాబు కళ్లల్లో కనిపిస్తోందనీ, అందువల్లనే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి చక్కెర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఏం చూసి బీజేపీకి మద్దతిస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి