వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కనిపిస్తోంది : అద్వానీ

మంగళవారం, 25 మార్చి 2014 (17:25 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, ఇది స్పష్టంగా కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై తన ట్విట్టర్ బ్లాగులో కొన్ని కామెంట్స్ చేశారు.

తన రాజకీయ జీవితంలో చాలా ఎన్నికలు చూశానని, కానీ 2014 లోక్‌సభ ఎన్నికలు చూపినంత స్పష్టంగా కాంగ్రెస్ ఓటమిని ముందుగానే మరే ఎన్నికలు చూపలేదన్నారు. స్వతంత్ర భారతంలో 1952 నుంచి జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో నేను పాల్గొన్నాను. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత విస్పష్టంగా కాంగ్రెస్ ఓటమి కనబడలేదు. అదే విషయాన్ని మా పార్టీ సహచరులకు చెబుతున్నాను అని తన బ్లాగులో పేర్కొన్నారు.

1989 నుంచి తాను గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా 11వ లోక్‌సభ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో తాను పోటీ చేశానని ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి