మోడీపై పోటీ చేస్తున్నానా.. నాకేం తెలియదే.. : దిగ్విజయ్
గురువారం, 20 మార్చి 2014 (17:28 IST)
File
FILE
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గురువారం స్పందించారు. ఆ వార్తల గురించి తనకేం తెలియదంటూ చెప్పుకొచ్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... నాకు తెలియదు. దీనిపై నాతో ఎవరూ మాట్లాడలేదు అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడిపై పోటీ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచన చేస్తూ... దిగ్విజయ్ సింగ్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.