కొందరికి హైహీల్స్ అంటే పిచ్చి.. ఎక్కడికి వెళ్లినా వాటినే వాడుతుంటారు. వారు నడవలేకపోయినా సరే ఆ హీల్స్‌నే వేసుకుంటారు. ఈ హైహీల్స్‌లో ఏముకుంటుందో కానీ, హైహీల్స్ వేసుకుంటే చూడడానికి బాగుంటుందేమోగానీ.. వాటి హీల్ పరిమితికి మించి ఉండడం వలన చాలా నష్టాలు ఉన్నాయి. కనుక హైహీల్స్ వేసుకున్నప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే.. తప్పక ఫలితం ఉంటుంది. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
1. ఎముక బాల్ మీద అదనపు ఒత్తిడి కలిగి, మడమలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దాంతో తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు అవసరమైనదానికంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ చెప్పులు మోకాల్లో లోపలివైపున ఒత్తిడిని కలిగించి, ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీస్తాయి.