గృహంలో మెట్ల అమరిక!

శనివారం, 16 ఆగస్టు 2008 (20:07 IST)
మెట్లను సక్రమంగా నిర్మించుకున్నట్లైతే రెండువిధాలుగా లాభం ఉంటుందని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. మంచి శక్తి ప్రభావం కింది అంతస్తుకే తగలకుండా మేడమీద అంతస్తులోకి కూడా పంపడానికి మెట్లు దోహదం చేస్తాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

సాధారణంగా మెట్లు మలుపులు తిరిగి ఉండటం మంచిదని, ఇలా నిర్మించడంతో మంచి శక్తి ఫలితాలను ఒక క్రమపద్దతిలో కావాల్సినంత రీతిలో అందుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలా అందడంవల్ల కింది అంతస్తులోనివారు, పై అంతస్తులోనివారు అన్నివిధాలా అభివృద్ధి చెందడంతోపాటు అనేక శుభఫలితాలిస్తాయని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

కొన్ని చోట్లలో ముఖ్యంగా అవుట్‌హోస్‌లలో, ఉండే గార్డెన్‌లలో ఎక్కువ మెలికలు తిరిగిన మెట్లుంటాయి. ఇలా నిర్మించుకుంటే గృహం ఆకర్షణీయంగా ఉంటుందని కొందరు అంటుంటారు. కాని ఇలా నిర్మించుకున్నట్లైతే మనకు లభ్యమయ్యే ప్రాణశక్తి అక్కడే నిరోధింపబడుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దానివల్ల పై అంతస్తులో ఎలాంటి మంచి శక్తి సరఫరా కాదని పేర్కొంటోంది.

వెబ్దునియా పై చదవండి