ప్రతి వ్యక్తికి తమ తమ రంగాల్లో నెంబర్‌వన్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫెంగ్‌షుయ్ సూత్రాలను కాస్త పాటించినట్లైతే మీరు మీ ఆఫీసుల్లో లేదా బిజినెస్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని సంపాదిస్తారని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.
మీరు టాపర్‌గా ఉండాలనుకుంటే మీ ఆఫీసు డెస్క్ కుడిచేతివైపు డ్రాగన్ బొమ్మని ఉంచాలని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. మీ ఆఫీసులో డెస్క్ కిటికీకి లేదా ప్రధమ ద్వారానికి ఎదురుగా ఉండాలి.
డ్రాగన్ బొమ్మ కిటికీ లేదా ప్రధమ ద్వారం వైపు చూస్తున్నట్లుగా ఉండినట్లైతే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. డ్రాగన్ బొమ్మ ఫౌంటెన్ వైపు చూస్తున్నా మంచిఫలితాన్నిస్తుందని ఫెంగ్ షుయ్ వెల్లడిస్తోంది.