ఫెంగ్‌షుయ్: క్లీన్ హౌస్.. లక్కీ హౌస్ అట..! ఇవిగోండి 10 టిప్స్!
ఫెంగ్‌షుయ్ ప్రకారం.. మీ ఇల్లు క్లీన్‌గా అదే లక్కీ అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం, దుమ్ము, బూజు వంటివి లేకుండా మీ ఇంటిని శుభ్రంగా ఉంచితే అదృష్టం మీ వెంటే ఉంటుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.
* అలాగే ఇంట్లో పంజరాలు వంటివి ఇంట్లో ఉంచకూడదు. పగిలిన వస్తువులు, పాతబడిన వస్తువులను తీసేయాలి. మీకు నచ్చని వస్తువులు ఇంట్లో ఉంటే దాన్ని ముందు వెలివేయాలి.
* ప్రకృతి సిద్ధంగా ఇంట్లోకి వచ్చే వెలుతురుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్నెన్నో వెలుతురు నిచ్చే లైట్స్ వచ్చినా పగలంతా ప్రకృతి సిద్ధంగా కిటికీలు, ఇంటి డోర్‌ల నుంచి వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి.
* ఇంట్లోని టేబుల్స్ మూలలు షార్ప్‌గా ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
* బాత్‌రూమ్స్ క్లీన్‌గా ఉంచుకోవాలి. రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఇంటికి ఏవేవో రంగుల్ని వాడకుండా మూడు రంగుల్ని మాత్రమే ఉపయోగించాలి.
* మీ ఇంట్లో ఉండే టేబుల్స్ మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. మీ పడక గదిలో టీవీ, కంప్యూటర్స్ వంటి భారీ ఎలక్ట్రిక్ వస్తువులను అవైడ్ చేయండి.
* మీ రూమ్‌లో అటాచ్డ్ బాత్‌రూమ్స్ ఉంటే రాత్రిపూట మూతపెట్టి పనుకోవాలి. తద్వారా చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించకుండా బ్రేక్ వేయవచ్చు.
* ఎప్పుడూ మీ మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవాలి. నెగటివ్ ఆలోచనలకు చెక్ పెట్టాలి. ఈ పది ఫెంగ్‌షుయ్ సూత్రాలు పాటిస్తే.. మీకు సానుకూల ఫలితాలు ఉంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.