ఫెంగ్‌షుయ్ ప్రకారం ప్రధమ ద్వార అలంకారణ

బుధవారం, 27 ఆగస్టు 2008 (19:00 IST)
మీరు ఇంట్లోకి ప్రవేశించే ప్రధమ ద్వారం ఎప్పుడూ ఇతరులను ఆకర్షించేవిధంగా అందంగా, శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఏర్పరుచుకున్నట్లైతే మంచి శక్తి మీ గృహంలోకి ప్రవేశిస్తుందని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. కాబట్టి ప్రధమ ద్వారానికి బయట, లోపల ఎలాంటి అవరోధాలు ఉండకూడదని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. ప్రధమ ద్వారానికి సమీపంలో ఎలాంటి పనికిరాని వస్తువులు, చెత్తచెదారం ఉండకూడదని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

కాగా ద్వారానికి బయట చెప్పులు, బూట్లుగాని ఉంచకూడదని, చాలా మంది చెప్పులను బయట వదిలి ఇంటిలోకి వస్తారు అలాంటి ప్రయత్నం వెంటనే వదలినట్లైతే కూడా మంచి ఫలితాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ప్రధమ ద్వారానికి ఒక పక్కగా చెప్పులు వదిలేటట్లు చూడాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

ప్రధమద్వారం సమీపంలో చెప్పులను పదిలితే దాని నుండి వెలువడే దుర్వాసనను మంచిశక్తి లోనికి తీసుకొస్తుందని దానివలన ప్రతికూల శక్తులను ఇంటిలోకి చోటిస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. హాల్లో ఏమైనా ఫౌంటెన్ గాని ఆక్వేరియంగాని ఉంచినట్లైతే మంచి ఫలితాల్నిస్తుందని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.

వెబ్దునియా పై చదవండి