ఫెంగ్‌షుయ్: మీ ఇంట్లో వాసనలు వెదజల్లే సెంట్స్ వాడుతున్నారా?

బుధవారం, 18 డిశెంబరు 2013 (17:01 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం మీ ఇంట్లో గానీ, ఆఫీసులో ఎలాంటి సెంట్స్ వాడాలో మీకు తెలుసా? అయితే ఈ కథనాన్ని చదవండి. ఫెంగ్‌షుయ్ ప్రకారం వాసనలు వెదజల్లే నూనెల్ని వాడటం మంచిది. ఉదాహరణకు మీ బెడ్‌రూమ్‌లో సెన్సువల్ సెంట్స్ వాడటం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

రోజ్, జాస్మిస్ వాసనలు వెదజల్లే ఆయిల్స్, రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడితే ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఆఫీసుల్లో పెప్పర్‌మింట్ లేదా లెమన్ గ్రాస్‌లకు చెందిన సెంట్స్ గాలిలో కలవడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా మీ గృహంలో ఎలక్ట్రికల్ క్యాండిల్ డిఫ్యూసర్ వాడటం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. ఇంకా వాసన వెదజల్లే నూనెలను వాడటం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎయిర్ స్ప్రే కూడా రోజ్, లావెండర్, జాస్మిన్ వంటివి ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి