ఫెంగ్‌ షుయ్ ప్రకారం పోస్ట్‌బాక్స్‌ అమరిక

శుక్రవారం, 8 ఆగస్టు 2008 (18:59 IST)
మీ వ్యాపారం నిత్యం కళకళలాడుతూ ఉండాలంటే... నిజానికి ప్రతి వ్యాపారానికి మూలం పోస్ట్‌‌బాక్స్ మూలమని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. అందులోవచ్చే ఉత్తరాలే మనకు కస్టమర్లనుండి ఆర్డర్ల రూపంలో వచ్చే కాసుల్లాంటివని ఆ శాస్త్రం చెబుతోంది. అందుకే మీ వ్యాపారం అనునిత్యం వినియోగదారులతో కళకళడుతుండాలంటే మీ పోస్టు బాక్స్ చూసే వారికి గమ్మత్తుగా రంగులమయంగా కంటికి ఇంపుగా కన్పించే విధంగా అమర్చుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

ముఖ్యంగా పోస్ట్ ద్వారా ఆర్డర్లు తీసుకునే వ్యాపారాలకు, ఇంట్లోనే వ్యాపారం చేసుకునే వారికి ఇది చాలా ఉత్తమమైన పద్దతని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. మీ పోస్ట్‌బాక్స్‌ని దక్షిణం వైపు ఉంచినట్లైతేవాటికి ఎరుపురంగు వేసుకోవచ్చని ఫెంగ్ షుయ్ చెబుతోంది. మిగిలిన దిక్కులకు తిప్పినట్లైతే ఆ రంగు మీద ఆ దిక్కుకు సంబంధించిన రంగుని అద్భుత బొమ్మలతో అందంగా ఆకర్షణీయంగా పోస్టు‌బాక్స్‌ను అలంకరించుకున్నట్లైతే ఆ తర్వాత మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తాయని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

వెబ్దునియా పై చదవండి