మీ కిచెన్ ఫెంగ్‌షుయ్ ప్రకారం ఎలా ఉండాలంటే..?

FILE
మీ వంటగదిలో ఫెంగ్‌షుయ్ సింబల్స్ ఉపయోగించడం ద్వారా మీ ఇంట్లో సిరిసంపదలు చేకూరుతాయి. మీ కిచెన్‌లో తాజా పండ్లను ఉంచడం.. ఎప్పటికప్పుడు వాడిన వస్తువులను తీసేయడం చేస్తే సుఖమయ జీవితం కలుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

తాజా పండ్లు, కూరగాయలు డైనింగ్ టేబుల్స్‌పై వుంచడం.. పగిలిన వస్తువుల్ని కిచెన్‌ నుంచి దూరం చేయడం చేస్తుండాలి. అలాగే బాగా వెలుతురు పడేలా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. విండ్ చిమ్‌ల ఏర్పాటు కూడా తప్పనిసరి.

ఇక పూజ చేస్తున్నప్పుడు మీ వంటగదికి రెండు ద్వారాలుంటే (ఫ్రెంట్, బ్యాక్ లాంటివి) బ్యాక్ గేటును మూతపెట్టేయాలి. ఇలా చేస్తే ఫెంగ్‌షుయ్ శక్తి మీ ఇంటి నుంచి వెళ్లిపోవడం కుదరదని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి