మీ శ్రీవారు, పిల్లల మీద అకారణంగా అరుస్తూ వుంటారా?

గురువారం, 3 జనవరి 2013 (17:25 IST)
FILE
మీ పిల్లలు, మీ శ్రీవారు/ శ్రీమతి మీద అకారణంగా అరుస్తూ, తిడుతూ ఉంటారా.. అయితే జాగ్రత్తపడండి. ఫెంగ్‌షుయ్ ప్రకారం ఎప్పుడూ ఇతరులను దూషించడం, కోపం, విచారం, ఈర్ష్య, ద్వేషం వంటివి వుండకూడదు.

అలాంటి వ్యతిరేక భావాలు మనలో వుంటే అవి ఇంటి నిండా ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఎక్కడ మనం సంతోషంగా, హృదయనిర్మలంగా ఉంటాయో అక్కడ గాలి సైతం ఆనందంతో నాట్యమాడుతుంది. మన హృదయాలు స్వచ్చంగా ఉంటే అక్కడ "చీ" శక్తి సైతం ఎంచక్కా ఇంటినిండా తిరుగుతుంది.

అందుచేత మీ ఇంట్లో ఆగ్రహంతో అరవకుండా ఆగ్రహాన్ని తగ్గించుకుని వీలైనంత మృదువుగా చెప్పండి. మీరు కోపంగా, ఆగ్రహంతో ఉంటే ఇంట్లో చెడ్డ చీ శక్తి తిరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి