రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌ను వాడితే భార్యాభర్తల మధ్య..?

సోమవారం, 8 జులై 2013 (16:52 IST)
File
FILE
క్రిస్టల్స్‌ను ఉపయోగించడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. క్రిస్టల్స్ ఉపయోగం ద్వారా మీ ఇంట్లో మంచి ఫెంగ్‌షుయ్ శక్తి నివాసముంటుందని వారు చెబుతున్నారు.

క్రిస్టల్స్‌ను ఇంటిరీయర్ డెకరేషన్‌కు ఉపయోగించడమే కాకుండా, సానుకూల ఫలితాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌ను ఉపయోగించడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమకు ఎలాంటి కొదవవుండదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.

ఈ క్రిస్టల్ వాడకం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుందని, గొడవలు, మనస్పర్థలకు తావుండదని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.

ఫెంగ్‌షుయ్ ప్రకారం.. రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ వాడకం ద్వారా దంపతుల మధ్య బంధం బలపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఆత్మగౌరవం పెంపొందుతుందని ఫెంగ్‌షుయ్ అంటోంది.

వెబ్దునియా పై చదవండి