మీ పర్సనల్ లేదా బిజినెస్ విజిటింగ్ కార్డును ప్రింట్ చేయించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే మీ సంపద, బిజినెస్ రెట్టింపు అవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
* మీ కార్డు చిహ్నం లేగా లోగో ఎప్పుడు కొనతేలెటట్లుగా ఉండకూడదు. ఇలా ఉంటే వ్యాపారాభివృద్ధి మందగిస్తుంది.
* మీ కార్డుమీద అక్షరాలు ఎప్పుడు లోగో మీదకు వచ్చేటట్లుగా డిజైన్ చేయకూడదు. గుండ్రటి, దీర్ఘచతురస్రాకారపు ఆకారాలను ఎన్నుకోవడం మంచిది.
* మీ కార్డు కోసం ఏ రెండు రంగులు వాడినా అవి ఒకదానికొకటి సరితూగునట్లుగా ఉండాలి. నిజానికి మంచి రంగుల కలయికలు అంటే.. పచ్చ- నలుపు, బ్రౌన్ నలుపు, నీలం- నలుపు మొగదలగునవి. అయితే నలుపు-ఆరెంజ్, నలుపు-పసుపు పచ్చ వంటి అభిలషణీయం కాని రంగులను విజిటింగ్ కార్డుల కోసం ఎంపిక చేసుకోవడం మంచిది కాదు.
ఇకపోతే.. మీ కార్డు సైజుకి ఒక వైపున 5 సెంటీమీటర్లు (అంగుళాలు)కు మించకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.