ఆఫీసులో తూర్పు దిక్కున ఆక్వేరియం ఏర్పాటు చేసుకుంటే?

FILE
మీ కార్యాలయంలో తూర్పు, ఉత్తరం లేదా ఆగ్నేయంలో ఆక్వేరియంను లేదా టేబుల్ టాప్ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకుంటే సానుకూల ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మీ డెస్క్‌కు ఉత్తరాన నలుపు లేదా నీలం రంగు చేపలు వేసిన చిన్న కుండీని పెట్టుకోవడం వల్ల మీ వాణిజ్యం, కెరీర్‌ విజయవంతం అవుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే పశ్చిమాన లేక వాయువ్య దిక్కున లోహంతో తయారు చేసిన సేఫ్‌ను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెండు దిక్కులూ లోహానికి సంకేతాలు. వ్యాపారంలో ఆర్ధిక భద్రతకు, సంపదకు సేఫ్‌ ఒక సంకేతమని వారు చెబుతున్నారు. కార్యాలయంలో డెకరేషన్ చేపట్టేటప్పుడు యిన్‌-యాం గ్‌లు రెండూ సమతులం గా ఉండేలా చూసుకోవాలి. లేత, ముదురు రంగులను సమతులం చేసుకోవాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి