కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారా? ఓ గంధపు అగరవత్తిని?

మంగళవారం, 4 ఫిబ్రవరి 2014 (17:17 IST)
FILE
కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారా? అయితే ఆ ఇంట్లో ఓ గంధపు అగరవత్తి వెలిగించాలని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. ఉద్యోగరీత్యా తరచూ ఇళ్లు మారుతుంటే ఈ విధానం పాటించడం ద్వారా ఆ గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తిని వెలివేసినట్లవుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

అదే విధంగా పాత ఇంట్లో సామాన్లను విరిగినవాటితో సహా కొత్త ఇంటికి తీసుకెళ్లటం చేసే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా చేయడం కూడా ఫెంగ్ షుయ్ ప్రకారం సరికాదు.

విరిగిపోయిన, పాడైపోయిన సామాన్లను అక్కడే వదిలేయటం మంచిదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ వాటిని వదిలేయటం ఇష్టం లేకపోయినట్లయితే, సదరు సామానులను బాగు చేయించి తీసుకెళ్లండని వారు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి