ఫెంగ్‌షుయ్: జాస్పర్ స్టోన్‌ను నైరుతి దిశలో ఉంచితే దంపతుల మధ్య?

ఫెంగ్‌షుయ్ ప్రకారం జాస్పర్ స్టోన్ ఉపయోగిస్తే సానుకూల ఫలితాలుంటాయి. జాస్పర్ స్టోన్ అనేది మిలమిల మెరిసే విధంగా ఉంటుంది.

ఈ జాస్పర్ స్టోన్ పసుపు, పచ్చ, నీలం, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ రాళ్ళతో చేసిన బ్యాండ్లు, చైన్లు, ఇతరత్రా ఇంటీరియర్ డెకరేటివ్ వస్తువుల్ని వాడటం ద్వారా మీ గృహంలో ప్రశాంత వాతావరణం చేకూరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే జాస్పర్ స్టోన్‌లో తయారయిన బుద్ధుడు, ఏనుగు బొమ్మలకు ఫెంగ్‌షుయ్ శక్తి అదనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోన్స్ ఉపయోగం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. మంచి ఎనర్జీ లభిస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.

ఇంకా ఈ జాస్పర్ స్టోన్‌ను ప్రేమకు చిహ్నమైన నైరుతి దిశలో లేదా హాలుకు మధ్య వేలాడిస్తే దంపతుల మధ్య అన్యోన్యం పెంపొందుతుంది. ఇకపోతే.. జాస్పర్ స్టోన్‌తో చేసిన బ్రేస్‌లెట్స్, రింగ్స్, బెల్టులు వాడటం ద్వారా మీలో కొత్త ఉత్సాహం చేకూరుతుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి