ఫెంగ్‌షుయ్ లవ్ ప్రాడెక్ట్స్ ప్లస్ మీ ప్రేమ పదిలం కావాలంటే?

FILE
ఫెంగ్‌షుయ్ లవ్ ప్రాడెక్ట్స్ ఏంటో మీకు తెలుసా? అలాగే మీ ప్రేమ పదిలం కావాలంటే? మీరేం చేయాలో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మీ ప్రేమ చిరస్థాయిగా మిగిలిపోవాలంటే ఫెంగ్‌షుయ్ సూత్రాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.

ప్రేమ అనేది సుఖమయ జీవితానికి పునాది అని.. అలాంటి ప్రేమను వ్యక్తం చేయడానికి ఫెంగ్ షుయ్ వస్తువులు మేలు చేస్తాయి. అంతేగాకుండా మీ ప్రేయసి లేదా ప్రేమికుడిని ఇంప్రెజ్ చేయాలంటే ఫెంగ్‌షుయ్‌తో ప్రయత్నించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

వాలెంటైన్స్ డే మాత్రమే కాదు.. మీ ప్రేమను వ్యక్తపరిచే ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజును ఫెంగ్‌షుయ్ వస్తువులను కానుకగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమ చిరస్థాయిగా మిగిలిపోతుందని, సుఖమయ జీవితం మీ సొంతం అవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అవేంటో తెలుసుకుందాం..
* రోజా వాసనలతో కూడిన సువాసనిచ్చే సెంట్‌లను మీ లవర్‌కు గిఫ్ట్ చేయొచ్చు.
* కపుల్స్ ఉండేలా బొమ్మలు
* లవర్స్ కలిసి డ్యాన్స్ చేసేలా బొమ్మలు
* క్రిస్టల్‌తో కూడిన హిమాలియన్ సాల్ట్ బౌల్ లాంప్ విత్ మసాజ్ బాల్స్‌తో..
* థాయ్ సిల్క్ ఫిల్లోస్,
* ఎరుపు రంగు కాటన్ దుస్తులు
* రొమాన్స్‌కు తాజా పువ్వులతో కూడిన పుష్ప గుచ్ఛాలు
* లవ్ క్యాండిల్స్, క్రిస్టల్ హార్ట్ పెండెంట్,
* హార్ట్ సింబల్‌తో కూడిన క్రిస్టల్ విండ్ చిమ్
* కిస్సింగ్ క్రిస్టల్ బొమ్మలు, ప్రేమ పుస్తకాలను బహూకరించవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి