భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : 9 రన్స్‌పై రోహిత్ క్యాచ్ డ్రాప్... ఆపై సెంచరీ బాది ఔట్

మంగళవారం, 2 జులై 2019 (17:29 IST)
ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. భారత ఓపెనర్లు 30 ఓవర్లలో 180 రన్స్ చేశారు. ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీ సాధించాడు. ఓ టోర్నీ లేదా ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. తద్వారా 2015లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. 
 
నిజానికి ప్రపంచ కప్ వంటి టోర్నీలో సెంచరీ చేయడమే ఓ మధురానుభూతి. అలాంటిది వరుసగా నాలుగు సెంచరీలు చేయడం అంటే సమాన్యమైన విషయం కాదు. భీకర పామ్‌లో ఉన్న రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు సింహ స్వప్నంలా మారాడు. 
 
నిజానికి రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 9 పరుగులపై క్యాచ్ ఇచ్చాడు. దీన్ని మిడ్ వికెట్ ఫీల్డర్ జారవిడిచాడు. ఫలితంగా 90 బంతుల్లో సెంచరీ బాదిన రోహిత్.. మరో రెండు బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో లిటాన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ఇక, బర్మింగ్‌హామ్ మ్యాచ్ విషయానికొస్తే, సెంచరీ సాధించిన కాసేపటికే రోహిత్ శర్మ (104) వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. అప్పటికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 180 రన్స్. రోహిత్ ఔట్ తర్వాత కోహ్లీ క్లీజ్‌లోకి వచ్చాడు. 
 
అయితే, స్కోరుకు మరో 15 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్ కూడా తన వ్యక్తిగత స్కోరు 77 వద్ద ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ సిక్సర్, ఆరు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలు ఉండగా, జట్టు స్కోరు 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు