స్త్రీ రూపంలో నర్తించే గణేశుడు...!

మూషిక వాహనదారుడైన వినాయకుడు, సిద్ధి, బుద్ది సమేతుడైన గణనాధుడు స్త్రీ రూపంలో నర్తిస్తున్నాడంటే నమ్ముతారా? కూర్చుని అభయాన్నిచ్చే వినాయక రూపాలనే మనం ఇంత వరకు చూసి ఉంటాం. అయితే కన్యాకుమారిలోని ఓ ఆలయంలో గణనాధుడు స్త్రీ రూపంలో నాట్యమాడుతూ దర్శనమిస్తాడు. భారత సాంస్కృతిక శిల్పకళా నైపుణ్యానికి ఈ శిల్పాలు నిలువెత్తు నిదర్శనాలు.

కన్యాకుమారి జిల్లాలోని సుసీంద్రమ్ ధానుమాలయన్ ఆలయంలోని ఓ స్థంభంపై వినాయకుడు నాట్యమాడుతూ కనిపిస్తాడు. ఓ కాలుపైకి పెట్టుకుని, మరో కాలుని కింద ఉంచి వయ్యారంగా నిల్చుని, అభయమిస్తుంటాడు వినాయకుడు. స్త్రీ నాట్యభంగిమలో కనిపించే ఈ రూపాన్ని గణేశిని, గజానని అని పిలుస్తుంటారు.

అలాగే మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుని ఆలయ ప్రధాన ద్వారముపై గణేశిని రూపము చెక్కబడి ఉంటుంది. ఈ రూపంలో ఉన్న వినాయకుని కాళ్లు పులి కాళ్లను పోలి ఉంటాయి. అందుకని ఈ రూపంలో ఉన్న గజాననుడు వియాగ్రపాద గణేశిని అని పిలువబడుతుంటాడు.

వెబ్దునియా పై చదవండి