నవరత్నాలు ధరించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయట?

మంగళవారం, 14 మే 2019 (15:21 IST)
నవరత్నాలను ధరించడం ద్వారా వ్యాధులు నయం అవుతాయా... అంటే అవుననే చెప్తున్నారు.. రత్నాల శాస్త్ర నిపుణులు. నవరత్నాలు అదృష్టాన్ని చేకూరుస్తాయి. నవరత్నాలను పుట్టిన తేదీకి అనుగుణంగా ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
ఈ నవరత్నాలను ధరించడం ద్వారా చర్మానికి ఆ రత్నపు తాకిడి ద్వారా అనారోగ్య సమస్యలు వుండవని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా రత్నాలు అదృష్టాన్నే కాకుండా ఆరోగ్యాన్నిస్తాయని వారు చెప్తున్నారు. 
 
ఇందులో ఏయే రత్నం ఏయే రోగాన్ని దూరం చేస్తాయో చూద్దాం.. 
మాణిక్యం - హృద్రోగాలను దూరం చేస్తాయి 
ముత్యం - నిద్రలేమిని నయం చేస్తుంది 
 
పగడం - కాలేయానికి సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వదు. 
మరకతం పచ్చ- నరాలకు సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. 
 
వజ్రం- సంతాన ప్రాప్తినిస్తుంది. 
వైఢూర్యం - కఫం, జలుబు, దగ్గు 
పుష్యరాగం - ఉదర సంబంధింత రుగ్మతలు 
గోమేధికం - అసిడిటీ సంబంధిత రోగాలు 
నీలం - వాత సంబంధిత రోగాలను నయం చేస్తాయి. 
 
నవరత్నాలతో కూడిన ఉంగరాలను ధరించడం ద్వారా వృద్ధి ఖాయమంటున్నారు.. రత్నాల శాస్త్ర నిపుణులు. అలాగే 12 రాశుల వారికి ఒక్కో రత్నం అదృష్టాన్నిస్తుంది.


రాశికి తగిన రత్నాన్నే జాతకులు ధరించాల్సి వుంటుంది. అప్పుడే నవరత్నాల ప్రభావంతో శుభఫలితాలను అందిస్తుంది. అలాగే రాశుల ప్రకారం నవరత్నాలను ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు