* వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర మిక్కీ మౌస్ రెండు చేతులకూ నాలుగేసి వేళ్లే ఉంటాయి పిల్లలూ... గమనించారా..?!
* బ్రిటన్ రాజ కుటుంబంలో పిల్లలు పుట్టినప్పుడు సైనికులు గౌరవపూర్వకంగా నలభై ఒక్కసార్లు తుపాకీ పేల్చుతారు.
* తొలిరోజుల్లో కార్లన్నీ నలుపురంగులోనే తయారయ్యేవట. అందుకు భిన్నంగా ఫోర్డ్ కంపెనీ 1925లో ఆకుపచ్చ, మెరూన్ రంగుల్లో కార్లను ఉత్పత్తి చేసింది.
* ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాలలో దాదాపు 50 వరకూ ఒక్క ఆసియా ఖండంలోనే ఉన్నాయి.
* విమానంలో ఉండగా యూఎస్ గగనతలంలోగానీ, అమెరికా తీరానికి 12 నాటికల్ మైళ్ల లోపు సముద్రంపై షిప్‌లో ఉండగాగానీ పుట్టిన బిడ్డలను అమెరికన్ పౌరుల కిందనే లెక్కిస్తారట.
* స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నడుము చుట్టుకొలత ఎంతో తెలుసా... 35 అడుగులు.
* బుధగ్రహంపై రోజుకన్నా సంవత్సరం చాలా చిన్నదట. బుధుడు తన చుట్టూ తాను నెమ్మదిగానూ, సూర్యుడి చుట్టూ బాగా వేగంగానూ తిరగడమే ఇందుకు కారణమట.