ఇవి మీకు తెలుసా పిల్లలూ..!

* ఐన్‌స్టీన్‌కి కారు నడపటం రాదట. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా తన సైకిల్ మీదనో లేక నడుచుకుంటూనో లేదా ప్రజా రవాణా మార్గాల ద్వారానో వెళ్లేవాడట.

* ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాలలో దాదాపు 50 వరకూ ఒక్క ఆసియా ఖండంలోనే ఉన్నాయట.

* ప్రపంచంలోని అత్యధిక సూపర్ మార్కెట్లలో ఆహార పదార్థాలనూ, బేకరీ ఫుడ్స్‌ను ప్రవేశ ద్వారం వద్దనే ఉంచుతుంటారు. ఎందుకంటే, వాటి వాసనకు ఆకర్షితులై ఎక్కువమంది వాటిని కొనే అవకాశం ఉండటమే కారణం.

* బేస్ బాల్‌కు ఉండే కుట్ల సంఖ్య ఎంతంటే... 104.

* ఒక పురుగు పేరుతో వ్యవహరిస్తున్న ఏకైక క్రీడ... క్రికెట్.

* చేపలు తమ మొప్పలతో రుచిని తెలుసుకోగలుగుతాయట.

* షేక్స్‌పియర్ రచనల ఆధారంగా ఇప్పటిదాకా దాదాపు 400 సినిమాలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి