సిల్లీ.. సిల్లీ... విషయాలు మీ కోసం...!!

అన్ హింగా అనే పక్షి చేపల్ని చాలా విచిత్రంగా తింటుందట పిల్లలూ... ఎలాగంటే, ముందుగా నీళ్లలో మునిగి ఈదుకుంటూ లోతుకు వెళ్లి అక్కడ హింగా పక్షి దొరబుచ్చుకుంటుందట. ఆ చేపను అలాగే ముక్కుకు కరచుకుని పైకి వచ్చి.. చేప తల సరిగ్గా ఈ పక్షి నోట్లో పడేలాగా గాల్లోకి ఎగరేసి మరీ తింటుందట. ఒకవేళ చేప తల సరిగ్గా దీని నోట్లోకి పడకపోతే, అలా ఎన్ని సార్లయినా సరే పైకి ఎగరవేస్తూనే ఉంటుందట...! నిజంగానే భలే విచిత్రంగా ఉంది కదూ పిల్లలూ...!!

ధ్రువపు ఎలుగుబంట్లు సాధారణంగా ఒకే కాన్పులో రెండు పిల్లలకు జన్మనిస్తాయట. వాటికి ఒకటి, లేదా మూడు పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందట పిల్లలూ...! ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న వెనీలా మూడింట రెండు వంతుల పంట ఒక్క మడగాస్కర్‌లోనే పండుతుందట.

వాన చినుకులు గంటకు ఏడు మైళ్ల వేగంతో భూమిని తాకుతాయట. అట్లాంటిక్ మహా సముద్రం వైశాల్యం ప్రతి సంవత్సరానికీ.. కొన్ని సెంటీమీటర్ల చొప్పున పెరుగుతోందట. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాల్లో దాదాపు 50 వరకూ, ఒక్క ఆసియా ఖండంలోనే ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి