చిన్నారులూ.. ఇవి మీకు తెలుసా...?!

* సాలీడు కేవలం నేలమీద మాత్రమే కాదు, నీటిలో కూడా జీవిస్తుంటుంది. డైవింగ్ బెల్స్‌గా పేరుపొందిన ఈ సాలీళ్లు నీటిలోపలే నివాసం కోసం గూళ్లను కూడా నిర్మిస్తుంటాయి.

* మనిషి శరీరంలో 200 ఔన్సుల రక్తం ఉంటుంది. మన శరీరం నుంచి 8 ఔన్సుల రక్తం బయటికి తీసినట్లయితే.. మళ్లీ అంత రక్తం శరీరంలో తయారవ్వాలంటే రెండు రోజులు పడుతుంది. రక్తం నీటికన్నా ఆరు రెట్లు ఎక్కువ చిక్కగా ఉంటుంది. రక్తం గంటకు 7 మైళ్ల వేగంతో ప్రవహిస్తుంటుంది.

* నిద్రపోతే ఏమయిపోతామో అని భయపడేవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు తెలుసా పిల్లలూ... వీరికుండే ఇలాంటి నిద్ర భయాన్ని వైద్యులు "హిప్నో ఫోబియా" అని పిలుస్తారు.

వెబ్దునియా పై చదవండి