"పియానో హౌస్‌" అంటే ఏంటి పిల్లలూ...?

పిల్లలూ మీరెప్పుడైనా పియానో హౌస్ గురించి విన్నారా..? చూసేందుకు అచ్చం పియానోలాగా ఉండే ఈ భవనం చైనా దేశంలో ఉంది. పియానో హౌస్ లోపలి భాగంలో ఎస్కలేటర్ ఉండటమేగాకుండా, ఈ కట్టడం లోపల ఎన్నో రకాల సిటీ ప్లాన్స్ గీసి ఉంటాయి.

అంతేగాకుండా.. పియానో హౌస్‌లో చైనా దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం గురించిన వివరాలను పొందుపరచారు. మల్టీ నేషనల్ కంపెనీలన్నీ కూడా ఈ కాంప్లెక్స్‌లో ఉంటాయి. అయితే ఈ పియానో హౌస్ చూసేందుకు ఎంతో ఆధునికంగా, అందంగా కనిపించినప్పటికీ... కల్చరల్ ప్రోగ్రామ్స్ మాత్రం అందులో ఏర్పాటు చేయరు.

ఎందుకంటే... ఎప్పుడు చూసినా ఈ భవంతి విపరీతమైన రద్దీగా ఉండటం వల్లనే ఎలాంటి ప్రోగ్రాములు జరిపేందుకు ఆస్కారం ఉండదు. వినేందుకే చాలా సరదాగా ఉండే ఈ పియానో హౌస్‌ను... మీకెప్పుడయినా చైనా వెళ్లే అవకాశం వచ్చినట్లయితే, తప్పకుండా చూసి వస్తారు కదూ..!

వెబ్దునియా పై చదవండి