తులసి ఆకులు, తులసి విత్తనాలు. వీటిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయి. రోజు తులసి విత్తనాలను తింటే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. తులసి విత్తనాలను రోజూ తినడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాము.
తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది.
రోజూ తులసి విత్తనాలను తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
చర్మంపై వచ్చే ముడతలు తగ్గేందుకు తులసి విత్తనాలను తింటే ఫలితం కనిపిస్తుంది.
తులసిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. దాంతో వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.