కొందరికి జలుబు వలన తుమ్ములు వస్తుంటాయి. మరికొందరికి బయటి పదార్థాలు ముక్కు రంధ్రాలలోనికి వెళ్లినపుడు ముక్కు జిలపెడుతుంది. తుమ్ము వచ్చినప్పుడు కడుపు, రొమ్ము, డయాఫ్రమ్, స్వరపేటిక, గొంతు వెనుకభాగం, కళ్ళు ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి బయటి నుండి శరీరం లోనికి వెళ్లిన పదార్థాలను తుమ్ము ద్వారా బయటకు పంపుతాయి.