మిరపకాయ... చేసే మంచి ఏంటి? చెడు ఏంటి?

శనివారం, 25 ఫిబ్రవరి 2017 (20:37 IST)
మిరపకాయ అన్ని వంటకాల్లోనూ వాడుతుంటారు. ఈ మిరపకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నట్లే సమస్యలు కూడా వున్నాయి. ముందుగా మిరపకాయలో వున్న ఔషధ గుణాలేమిటో చూద్దాం.
 
పచ్చి మిరపకాయలో ఎ,సి విటమిన్లు వున్నాయి. నాడీ వ్యాధి, నడుమునొప్పి, వాత రోగులకు మిరపకాయ భలే పనిచేస్తుంది. ఇందులో రేడియో ధార్మిక ప్రభావం వల్ల కలిగే దుష్ఫ్రభావాల నుండి రక్షిస్తుంది. కేన్సర్ వ్యాధిని నిరోధించగలుగుతుంది. హృదయ సంబంధ్య వ్యాధులను సైతం అడ్డుకుంటుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ను  కూడా తగ్గిస్తుందని నిపుణులు చెపుతున్నారు.
 
మిరప చేసే చెడు విషయానికి వస్తే... మిరపలో వుండే కాప్సిసిన్ అనే రసాయనం చిన్నప్రేగుల మ్యూకస్ పొరను దెబ్బ తీస్తుంది. అందుకే ఎక్కువగా మిరపను తీసుకోరాదు. అది చిన్నప్రేగులను దెబ్బతీస్తే రక్తస్రావం జరుగుతుంది. మిరపకాయలను ఎక్కువగా తినేవారిలో జీర్ణకోశ సంబంధ సమస్యలు ఎక్కువవుతాయి. కనుక మోతాదుకు మించని మిరపతోనే ఆరోగ్యం. గరంగరం కారం అంటూ ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

వెబ్దునియా పై చదవండి